The way to reach Ramappa Temple and the uniqueness of Ramappa Temple

Today our journey to Ramappa Temple:


Today we started at the railway station to reach the Ramappa temple. Taxis are available to reach the Ramappa Temple outside the railway station after reaching the railway station first. We can visit Bhadrakali Temple 5 km after starting our journey by taxi.


 Sri Bhadrakali Temple:


Orugallu is said to be the temple of the Bhadrakali Kakatiyas, who were revered by the people. There is evidence here that this temple was built in the year 625 AD. The statue of Goddess here is 9 feet high and wide. Surrounding the temple is the Bhadrakali Pond, the beauty of which attracts visitors


 Temple of a Thousand Pillars:


The Thousand Pillars Temple is located at a distance of 3 km from the Sri Bhadrakali Temple. The temple was built by the Kakatiya king Rudrama I in the year 1063 AD. It was originally known as the Kakatiya Temple. It took almost 70 years to build the temple.




How to reach ramappa Temple from
Warangal Thousand Pillars Temple:

From the Thousand Pillars Temple, there are no direct buses to the Ramappa Temple.

 

 Ramappa:


Before we reach the Ramappa Temple, we need to know about the architectural history of the place. The Kakatiyas and the Hoysala kings were vassals of the Chola dynasty. But with the weakening of the Chola dynasty these kingdoms emerged as independent kingdoms. Thus the architecture here is similar to the architecture of the Chola kingdom.




 Structure:

The temple was built in 1073 AD to commemorate the victory of the Kakatiya dynasty in the battle of Rudra by Racharla. It took almost 40 years to build. The temple derives its name from the sculptor Ramappa. However, the Shivalinga was erected in this temple by Rudra of Rachar, hence the name Rudreshwara Temple. However, Ramappa is the only temple in our country with a sculptural name.

It was largely destroyed by the invasions of Mallad Kafar, the commander of Allauddin Khilji, and was later restored by the Archaeological Survey of India.

There is a black stone inscription related to this temple which is difficult to read by writing together in Telugu and Kannada languages.

The temple is built on an interlocking pedestal by an interlocking system. Although this stone looks very hard to look at and is very soft to the touch, the temple was built entirely of stone, but at the apex of the temple it was built of floating bricks to reduce the load, and it must be said that the development of such technology almost eight hundred years ago was a miracle.



 Sculptures:


The temple has 3 entrances and four entrances (sculptures) at each entrance. If we look at those sculptures

 1. In one sculpture, a tribal woman is seen holding a bow and going hunting.

 2. A dancer is sculpted as if she were dancing.

 3. On the other hand there are nagini and copper sculptures. It can be seen here that the high heels used during this period for the copper sculpture sandals are similar to the heel sandals, and the nagini looks like dancing on a snake. Her eyes are seriously like snake eyes.

 4. Elephants were used to move the stones during the construction of the temple, thanks to which 526 elephant sculptures were carved around the temple.

 5. On the walls around the temple are mostly carved figures of Jain Tirthankaras. There are also sculptures of Hindu deities and wrestling. Especially the sculptures of the Egyptians are also carved.

 6. Here we can see sculptures named Gajakesari which is the title of Kakatiyas. In this sculpture we can see the soldier in the middle of the elephant below and the lion above that.





రామప్ప దేవాలయానికి ఈరోజు మన ప్రయాణం:


రామప్ప దేవాలయాన్ని ఈరోజు మనం చేరేందుకు రైల్వేస్టేషన్లో ప్రారంభమయ్యాం. ముందుగా రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్ బయట రామప్ప దేవాలయాన్ని చేరేందుకు టాక్సీలుసిద్ధంగా ఉంటాయి. మనం టాక్సీలో ప్రయాణం ప్రారంభించిన 5 కిలోమీటర్లు తరువాత భద్రకాళి దేవాలయాన్ని సందర్శించవచ్చు.


శ్రీ భద్రకాళి దేవస్థానం:


ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా నిలిచిన భద్రకాళీ కాకతీయుల నాటి దేవస్థానంగా చెబుతుంటారు. ఈ ఆలయం క్రీస్తు శకం 625 నిర్మించినట్లుగా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహం 9 అడుగుల ఎత్తు మరియు వెడల్పు ఉంటుంది. ఈ ఆలయానికి ఆవరించి భద్రకాళీ చెరువు ఉంది, దీని సౌందర్యం సందర్శకులను కట్టిపడేస్తున్నాయి


వేయి స్తంభాల గుడి:


శ్రీ భద్రకాళి దేవస్థానం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వేయి స్తంభాల గుడి ఉంది. ఈ గుడి క్రీస్తు శకం 1063 సంవత్సరంలో కాకతీయ రాజు 1వ రుద్రమదేవుడు నిర్మించాడు. మొట్టమొదట కాకతీయులు నిర్మించిన దేవాలయంలమగా దీనికి పేరుంది.ఈ ఆలయాన్ని నిర్మించేందుకు దాదాపు 70 సంవత్సరాలు పట్టింది.ఆ రోజుల్లో ఇక్కడి వేయి స్తంభాల గుడి నిర్మించడం వలన ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది కానీ ఈ దేవాలయంలోని వేయిస్తంభాల విడివిడిగా కనిపించవు దీనికి కారణం పాడుపడిన స్తంభాలను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించడమే.


వరంగల్ వేయి స్తంభాల గుడి నుంచి రామప్ప చేరుకునే మార్గం:

వేయి స్తంభాల గుడి నుంచి రామప్ప దేవాలయానికి డైరెక్ట్ గా బస్సులు లేక పోవడం చేత మనం ముందుగా హన్మకొండ బస్టాప్కి వెళ్లాలి.ఇక్కడినుంచి ములుగు బస్ స్టాప్ కు చేరుకోవాలి.ములుగు నుంచి రామప్ప దేవాలయానికి కేవలం 16 కిలోమీటర్లు మాత్రమే పాలంపేట వెళ్లే బస్సు ద్వారా ప్రయాణించి చేరుకోవచ్చు.

 

రామప్ప:


మనం రామప్ప దేవాలయం చేరుకునే ముందు ఇక్కడి ఆర్కిటెక్చర్ చరిత్ర గురించి తెలుసుకోవాలి.కాకతీయులు మరియు హొయసల రాజులు చోళ రాజ్యానికి సామంతులుగా ఉండేవారు. కానీ చోళరాజ్యం బలహీనపడటం చేత ఈ రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా వెలుగొందాయి. అందువలన ఇక్కడ ఆర్కిటెక్చర్ చోళ రాజ్య ఆర్కిటెక్చర్ ను పోలి ఉంటుంది.

నిర్మాణం:

ఈ దేవాలయం కాకతీయ రాజ్య సేనాని రేచర్ల రుద్రుడు క్రీస్తుశకం 1073 లో యుద్ధంలో గెలిచినందుకు గుర్తుగా నిర్మించాడు. దీనిని నిర్మించేందుకు దాదాపుగా 40సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయ రూప శిల్పి రామప్ప ఆయన పేరు మీద గానే ఈ ఆలయం పేరు వచ్చింది. అయితే ఈ ఆలయములో శివలింగాన్ని ప్రతిష్టించినది రేచర్ల రుద్రుడు అందువలనే ఈ ఆలయాన్ని రుద్రేశ్వరాలయం పిలుస్తారు. అయితే మన దేశంలో శిల్పిపేరుతో ఉన్న ఒకే ఒక ఆలయం రామప్ప.

అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫర్ దండయాత్రల వలన చాలా వరకు ధ్వంసం చేయబడింది తరువాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు దీన్ని పునరుద్ధరించారు.

ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి ఒక నల్లరాతి శిలాశాసనం ఉంటుంది అది తెలుగు మరియు కన్నడ భాషలలో కలిపి రాయడం చేత చదవడం కష్టమవుతుంది.

ఈ ఆలయాన్ని నక్షత్రాకార పీఠంపై ఇంటర్ లాకింగ్ సిస్టం ద్వారా నిర్మించారు. ఈ రాతిని చూసేందుకు చాలా కఠినంగా కనిపిస్తున్నప్పటికీ చేతితో తాకినప్పుడు చాలా మృదువుగా ఉంటుంది ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించారు, కానీ ఆలయ శిఖర భాగంలో భారం తగ్గించేందుకు నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించారు, దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఇటువంటి టెక్నాలజీ అభివృద్ధి చేయడం ఒక అద్భుతం అని చెప్పాలి.


శిల్పాలు:


ఈ దేవాలయానికి 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి, ప్రతి ప్రవేశ ద్వారానికి నాలుగు మదనికలు(శిల్పాలు)ఉన్నాయి. మనము ఆ శిల్పాలను పరిశీలిస్తే

1. ఒక శిల్పంలో ఒక గిరిజన స్త్రీ విల్లును పట్టుకొని వేటాడేందుకు వెళుతూ ఉన్నట్లుగా ఉంది.ఆమె కాలికి ముళ్ళు గుచ్చుకోవడం చేత ఆమె తో వచ్చిన వ్యక్తి ఆ ముద్దులు తీసి వేస్తున్నట్లుగా అలాగే ఆమెకు ముళ్ళు గుచ్చిన ప్రదేశంలో వాచినట్లుగా అద్భుతంగా చెక్కబడి ఉంది.

2. ఓ నాట్యకారిణి నాట్యం చేస్తున్నట్లుగా చెక్కబడి ఉన్నది.అయితే ఆ నాట్యకారిణి నాట్యం చేయడం ద్వారా ఆమె కాళ్లు శిల్ప చెక్కిన విధానం,అంతేకాకుండా ఆ కాలి వేళ్లను గోళ్లను చెక్కిన విధానం అద్భుతంగా ఉంటుంది.

3. మరోవైపు నాగిని,రాగిని శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ గమనిస్తే రాగిని శిల్పానికి చెప్పులుగా ఈ కాలంలో ఉపయోగించే ఎత్తు మడమల చెప్పులను పోలి ఉన్నాయి, ఇంకా నాగిని పాముపై నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.ఆమె కళ్ళు గంభీరంగా పాము కళ్ళు వలె ఉన్నాయి.

4. ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు రాళ్లను తరలించేందుకు ఏనుగులను ఉపయోగించారు,దానికి కృతజ్ఞతగా ఈ ఆలయం చుట్టూ 526 ఏనుగుల శిల్పాలను చెక్కారు.

5. ఆలయము చుట్టూ గోడలపై ఎక్కువగా జైనతీర్థంకరుల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. అంతేకాకుండా హిందూ దేవతల శిల్పాలు మరియు మల్ల యుద్ధానికి సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ప్రత్యేకంగా ఈజిప్షియన్ల శిల్పాలు కూడా చెక్కబడి ఉన్నాయి.

6. కాకతీయుల బిరుదు అయిన గజకేసరి పేరుతో శిల్పాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ శిల్పంలో మనం కింద ఏనుగు మధ్యలో సైనికుడు ఆ పైన సింహం చూడవచ్చు.


మనం ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే ఆలయ గచ్చు పై గల బండలు కొన్ని పైకి లేచి నట్లుగా మరికొన్ని విరిగినట్లుగా కనిపిస్తాయి. దీనికి కారణం ఏంటంటే 17వ శతాబ్దంలో తీవ్రమైన భూకంపం చేత అని చెబుతున్నారు.

ఆలయం గర్భగుడి మధ్యలో శాతవాహన నృత్యం అయిన పేరిణి శివతాండవము కి సంబంధించిన శిల్పాలు ఉంటాయి. కాకతీయులు యుద్ధానికి ముందు ఈ నాట్యం చేయడం ద్వారా స్ఫూర్తిని పొందేవారిని నానుడి. ప్రస్తుతం తెలంగాణ నృత్యంగా పేరణి శివతాండవం ఉంది. ఈ శిల్పాలకు అంచులపై శ్రీకృష్ణుడు ఫ్లూటు కొట్టుకుని ఉన్నట్లుగా ఉంటుంది ఇక్కడ మనం తాగితే సంగీత శబ్దాలు కూడా వినవచ్చు

Post a Comment

Previous Post Next Post