Trip to Puri and World Heritage Site Konark Sun Temple 🌞

Opportunities for us to reach Puri Temple:


 Train travel:

We can easily reach Puri by train.  As Puri is the district headquarters, all trains stop at Puri, otherwise we can reach the destination by passenger train from Kurtharod Junction.  Because trains traveling through Orissa definitely stop there.


 Air Travel:

Puri does not have an airport. So we have to reach Bhubaneswar, the capital of Odisha, and reach Bhubaneswar International Airport by train or bus.  It is located at a distance of 70 km from Bhubaneswar.


 Hotels & resorts in Puri:

There are many hotels and resorts in Puri.  You can book good rated hotels online.  There are good hotels and resorts within a kilometer of the Puri Shrine.


 Puri:

Puri Temple is one of the holiest shrines of Badrinath, Dwarka, Rameshwaram and Puri in the country.  The temple is believed to have been built to the extent that Lord Vishnu appeared in a dream and ordered.  The present temple was started by Raja Ananthavarma Chodagangadeva in the 12th century and was completed by his grandson Raja Ananga Bhima Deva.




 Secrets of Puri Shrine:

 1. The flag above the dome of the Puri Shrine flies in the opposite direction of the wind.

 2. The Sudarshan Chakra on this dome looks like it is on our side when viewed from Puri City.

 3. No birds fly over the Puri temple.  Although many scientists have done a lot of research, they have not been able to solve this mystery.

 4. The shadow of the main dome of Puri is not visible to us.  We can not see the shadow of the main dome at any of those times.

 5. At the beach the wind blows from the sea towards the land in the morning as well as from the land towards the sea in the evening but the opposite happens at Puri beach.

 6. Every day the priest climbs to the top of the forty-five storey high tower and changes the flag above.  It is believed that the temple will be closed for 18 years if this process is stopped.

 7. The sound of sea waves near the Puri temple can be heard one step in front of the temple and if one steps inside, the sound will not be heard again.

 8. 56 types of dishes are offered to Jagannath.  They are cooked in a pottery according to the temple tradition.

 9. New chariots are built every year during the annual Puri Rath Yatra.  And the statues in the temple are rotated in the city streets.


 Puri beach:

This beach sunrise at 5am is amazing.  A large bazaar is set up on the beach at night on the Puri beach.  There are a variety of food stalls here and you can also buy decorative items related to seafood.


 Chilka Lake:

Buses are available from Puri to Chilaka Lake.  Chilaka Lake is a must visit place for those visiting Puri, as is the boating facility and the dolphin spot.


 Loknath Temple:

Puri is located at a distance of about two kilometers from the temple.  This temple is two hundred years older than the Puri temple.


 Markandeshwara Temple:

It is located at a distance of 1 km from the Puri Temple. It is mentioned in the Markandeya Purana.


 Gundicha Temple:

The idols are kept here for three days during the main temple rath yatra at Puri in this temple.


 Narendra Tank:

Where the Chandanotsavam Yatra takes place.


 Konark Sun Temple:

Konark is about forty kilometers from the Puri Shrine. We can reach this place by passenger buses and taxis.  We can visit Chandra Bagh Beach three kilometers before we reach Konark.  According to the history of the temple, the idol was found in the Konark Sun Temple on the Chandrabhaga beach.  Angle means angle or direction. Arc means sun.






 History of Konark Sun Temple:

The temple was built by Narasimha Deva of the Eastern Ganga dynasty in the 13th century and is said to have started in 1238 and was completed in 1250.


 Architecture:

The Konark Sun Temple was built by 12 hundred sculptors over a period of 12 years.  The temple was built as if pulling chariots with seven horses and twelve pairs of wheels.  The seven horses are said to have been built to symbolize the seven colors present in the ray of light coming from the sun.  Also these wheels are built to let them know the exact time depending on the shade.  But here we can know only through anti-clockwise direction when looking at the time.


 Here we see three idols of the sun god

 1. The smiles look like a statue of the rising sun.

 2. Looks as solemn as the afternoon sun.

 3. Looks like the sun that is contemplative during the evening.


The Konark Sun Temple is now barred from entering due to the demolition of the sanctum sanctorum.  However, one can still see the Odyssey dance poses and sculptural beauty carved on the pavilion. Here we can see the wheel on the ten rupee note we are currently using.


పూరీ దేవాలయానికి చేరుకునేందుకు మనకు ఉన్న అవకాశాలు:


రైలు ప్రయాణం:

మనం రైలు ద్వారా పూరీని సులభంగా చేరుకోవచ్చు. పూరి జిల్లా ప్రధాన కేంద్రం కావడంచేత పూరీలో ప్రధానంగా అన్ని రైళ్ళు ఆగుతాయి, లేకుంటే మనం కూర్థరోడ్ జంక్షన్ నుంచి పాసింజర్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. ఎందుకంటే ఒరిస్సా గుండా ప్రయాణించే రైళ్లు అక్కడ కచ్చితంగా అగుతాయి.


విమాన ప్రయాణం:

పూరీ లో విమానాశ్రయం లేదు.అందువలన మనం ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకోవాలి,భువనేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి రైలు లేదా బస్సు ద్వారా ప్రయాణించి పూరీని చేరుకోవచ్చు. భువనేశ్వర్ నుంచి 70 కిలోమీటర్లు దూరం ఉంటుంది.


పూరీలో హోటల్స్ మరియు రిసార్టులు:

పూరీలో అనేక హోటల్స్ మరియు రిసార్ట్స్ ఉన్నాయి. మీరు ఆన్లైన్ లో మంచి రేటింగ్ ఉన్న హోటల్స్ ను బుక్ చేసుకోవచ్చు. పూరి పుణ్యక్షేత్రానికి ఒక కిలోమీటర్ దూరం లో మంచి హోటల్స్ మరియు రిసార్టులు ఉన్నాయి.


పూరీ:

పూరీ దేవాలయం దేశంలోనే పవిత్ర ఛార్థామ్ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్,ద్వారక,రామేశ్వరం,పూరీ క్షేత్రాలలో ఒకటి. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆజ్ఞాపించిన మేరకు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగాదేవా ప్రారంభించారు,ఈ దేవాలయ నిర్మాణాన్ని ఆయన మనవడు రాజా అనంగ భీమ దేవా పూర్తి చేశారు.


పూరీ పుణ్యక్షేత్ర రహస్యాలు:

1. పూరి పుణ్యక్షేత్ర గోపురం పైన ఉండే జెండా గాలివీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతుంది.

2. ఈ గోపురంపై ఉండే సుదర్శన చక్రం పూరి సిటీ నుంచి చూసినప్పుడు అది మన వైపే ఉన్నట్లుగా కనిపిస్తుంది.

3. పూరి ఆలయం పై నుంచి ఎటువంటి పక్షులు ఎగరవు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఈ విషయం రహస్యాన్ని ఛేదించలేకపోయారు.

4. పూరి ప్రధాన గోపురం యొక్క నీడ మనకు కనిపించదు. అది ఏ సమయంలోనైనా ప్రధాన గోపురం యొక్క నీడ మనం చూడలేము.

5. సాధారణంగా సముద్రతీరంలో గాలి ఉదయం సముద్రం వైపు నుంచి భూమి మీదుగా అలాగే సాయంత్రం భూమి నుంచి సముద్రం వైపు గా విస్తుంది కానీ పూరి బీచ్ లో దీనికి విరుద్ధంగా జరుగుతుంది

6. నలభై ఐదు అంతస్తుల ఎత్తులో ఉండే గోపురం పైకి ప్రతిరోజు పూజారి ఎక్కి పైన జండా మారుస్తుంటారు. ఈ ప్రక్రియ మానివేస్తే దేవాలయం 18 సంవత్సరాలు మూతపడుతుందని ఇక్కడ నమ్మకం.

7. పూరి దేవాలయం దగ్గర సముద్రా అలల శబ్దం ఆలయానికి ఒక్క అడుగు ముందు వినిపిస్తుంది,ఒక్క అడుగు ఆ లోపలికి వెళితే ఆ శబ్దం మరి వినిపించదు.

8. జగన్నాథుడికి 56 రకాల వంటకాలు సమర్పిస్తారు. అవి ఆలయ సంప్రదాయం ప్రకారం మట్టికుండలో వండుతారు.ఈ మట్టికుండలో పైన ఉన్న కుండ మొదటి ఉడుకుతుంది, తరువాత క్రింద ఉన్న కుండ ఉడుకుతుంది.

9. ప్రతి యేటా జరిగే పూరి రథయాత్ర సమయంలో ప్రతి సంవత్సరం కొత్త రథాలను నిర్మిస్తారు. మరియు దేవాలయంలో ఉండే మూర్తులను నగర వీధుల్లో తిప్పుతారు.


పూరి సముద్ర తీరం:

ఉదయం 5 గంటలకు ఈ సముద్రతీర సూర్యోదయం అద్భుతంగా ఉంటుంది. పూరి సముద్ర తీరంలో రాత్రిసమయంలో బీచ్ ఒడ్డున పెద్ద బజార్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అంతేకాకుండా సముద్ర ఉత్పత్తులకు సంబంధించిన అలంకార వస్తువులు కొనవచ్చు.


చిలక లేక్:

పూరి నుంచి చిలక లేక్ కు బస్సు సదుపాయం ఉంది. పూరి వెళ్లిన వారు ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రదేశం చిలక లేక్, ఇక్కడ బోటింగ్ సదుపాయం ఉంటుంది, అంతే కాకుండా ఇక్కడ డాల్ఫిన్ ఉండే ప్రదేశం అద్భుతంగా ఉంటుంది.


లోకనాథ ఆలయం:

పూరి ఆలయం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం పూరి ఆలయం కంటే రెండు వందల సంవత్సరాలు పురాతన దేవాలయం.


మార్కండేశ్వర ఆలయం:

పూరి ఆలయం నుంచి ఒక్క కిలో మీటర్ల దూరం ఉంటుంది.మార్కండేయ పురాణంలో దీని ప్రస్తావన ఉంది.


గుండిచ ఆలయం:

ఈ ఆలయంలో పూరీలో ప్రధాన దేవాలయ రథయాత్ర సమయంలో మూర్తులను మూడు రోజులు ఇక్కడ ఉంచడం జరుగుతుంది.


నరేంద్ర ట్యాంక్:

చందనోత్సవం యాత్ర ఎక్కడ జరుగుతుంది.


కోణార్క్ సూర్య దేవాలయం:

పూరి పుణ్యక్షేత్రం నుంచి కోణార్క్ దాదాపు నలభై కిలోమీటర్లు ఉంటుంది.మనం ఇక్కడికి వెళ్లేందుకు పాసింజర్ బస్సెస్ మరియు టాక్సీలు ద్వారా చేరుకోవచ్చు. మనం కోణార్క్ కు చేరుకునే మూడు కిలోమీటర్ల ముందు చంద్ర బాగా బీచ్ ను సందర్శించవచ్చు. ఈ ఆలయ చరిత్ర ప్రకారం చంద్రభాగ సముద్ర తీరంలోనే కోణార్క్ సన్ టెంపుల్ లో ప్రతిష్టించబడిన విగ్రహం దొరికిందని చరిత్ర. కోన అంటే కోణం లేదా దిక్కు అని అర్థం.ఆర్క అంటే సూర్యుడు అని అర్థం.


కోణార్క్ సూర్యదేవాలయ చరిత్ర:

ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గంగ రాజ్య వంశానికి చెందిన నరసింహదేవా నిర్మించారు.దీనిని 1238 లో ప్రారంభించి 1250 లో పూర్తి చేసినట్లు చెబుతారు.


ఆర్కిటెక్చర్:

కోణార్క సూర్య దేవాలయం ని 12 వందల మంది శిల్పులు 12 సంవత్సరాలపాటు నిర్మించారు. ఆలయ నిర్మాణంలో ఏడు గుర్రాలు మరియు పన్నెండు జతల చక్రాలు ఉన్న రథాలు లాగుతున్నట్లు గా నిర్మించడం జరిగింది. సూర్యుని నుంచి వచ్చే కాంతి కిరణం లో ఉండే ఏడు రంగులకు చిహ్నంగా ఏడు గుర్రాలు నిర్మించినట్లుగా చెబుతారు. అంతేకాకుండా ఈ చక్రాలు ఖచ్చితమైన సమయాన్ని వాటిని నీడను బట్టి తెలియజేసే విధంగా నిర్మించారు. అయితే ఇక్కడ మనం టైం చూసుకునేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు.


ఇక్కడ మనకు సూర్యదేవునికి సంబంధించి మూడు విగ్రహాలు కనిపిస్తాయి

1. ఉదయించే సూర్యుని విగ్రహం వలే చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తుంది.

2. మధ్యాహ్నం సూర్యుని వలె గంభీరంగా కనిపిస్తుంది.

3. సాయంత్ర సమయంలో చింతన గా ఉన్న సూర్యుని వలె కనిపిస్తుంది.


కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి ధ్వంసం చేయడం చేత ఇప్పుడు లోపలికి అనుమతించలేదు. అయినప్పటికీ ఈ మండపం పైన చెక్కిన ఒడిస్సీ నృత్య భంగిమలు మరియు శిల్ప సౌందర్యాన్ని చూడవచ్చు.మనం ప్రస్తుతం వినియోగిస్తున్న పది రూపాయల నోటు పై ఉన్న చక్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.


1 Comments

Previous Post Next Post